పంచాయతీ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం గూడలి గ్రామంలోని స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో ఇళ్ల వ్యర్థజలాల బహిరంగ విడుదలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.నివాసం నుంచి పెద్ద పైపును బయటకు ఏర్పాటు చేసి,ఇంట్లో వినియోగించిన మురుగునీరు, బాత్రూం నీరు,బట్టలు ఉతికిన నురుగు నీరు తదితర వ్యర్థజలాలను రహదారి వైపు విడుదల చేస్తున్న దృశ్యం స్థానికంగా కనిపిస్తోంది.ప్రధాన రహదారి పక్కనే ఈ విధంగా వ్యర్థజలాలు చేరుతుండటంతో రోడ్డుపై ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు,సైకిల్‌,ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు...