రంగ కవిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పచ్చిమడ్ల మానస గౌడ్

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  మహిళా నాయకురాలు, యాదాద్రి భువనగిరి జిల్లా జర్నలిస్ట్ రంగ కవిత తండ్రి రంగ స్వామి గౌడ్ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పచ్చిమడ్ల మానస గౌడ్, రంగ కవిత ని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రంగ స్వామి గౌడ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు....