కొండమల్లేపల్లి లో రేపు వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ అంతరాయం

నవపక్షం, కొండమల్లేపల్లి మండల ప్రతినిధి :  కొండమల్లేపల్లి మండలం గాజీనగర్‌లో కొత్త సబ్‌స్టేషన్‌కు 33 కేవీ లైన్‌ కోసం 33 కేవీ దేవరకొండ ఫీడర్‌లో శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు షట్‌డౌన్‌ ఉంటుందని విద్యుత్‌ ఆపరేషన్‌ ఏడీఈ ఎన్‌. శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. నేరేడుగొమ్ము, చిత్రియాల, కొత్తపల్లి సబ్‌స్టేషన్‌ల పరిధిలోని మైనంపల్లి, కొండభీమనపల్లి గ్రామాల్లో వ్యవసాయానికి 3 ఫేజ్‌ కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.