కోడూరు రాజమౌళి కుటుంబాన్ని పరామర్శించిన గండ్ర వెంకటరమణారెడ్డి
నవపక్షం, కొత్తపల్లిగోరి ప్రతినిధి : మండల కేంద్రంలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన కోడూరు రాజమౌళి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం సుల్తాన్‌పూర్ గ్రామానికి వెళ్లి రాజమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు. రాజమౌళి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దుఃఖంలో ఉన్న...