గురుకులంలో సబ్ కలెక్టర్ తనిఖీ
నవపక్షం, దేవరకొండ మండల ప్రతినిధి : దేవరకొండ మండలం కొండభీమనపల్లి పరిధిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలను సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంటగది, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి, విద్య గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల రికార్డులను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.