బాధిత కుటుంబానికి మంత్రి ఆర్థిక సహాయం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  రసూల్‌పూర్ గ్రామానికి చెందిన తీగల అమృత మృతి చెందిన విషయం తెలుసుకున్న నల్గొండ మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండెబోయిన వెంకన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు...