పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహణ
నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ దేవరకొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు వస్కుల సుధాకర్ అధ్యక్షతన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం టీటీడీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ రాష్ట్ర కార్యదర్శి వనం పుష్పలత మాట్లాడుతూ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, దేశం మరియు...