పీఎం శ్రీ మోడల్ స్కూల్ మర్రిగూడలో ఘనంగా మాక్ ఎన్నికలు — హెడ్ గర్ల్‌గా భవాని, హెడ్ బాయ్‌గా దుర్గా ప్రసాద్ రెడ్డి విజయం
నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి : విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో మర్రిగూడలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో శనివారం మాక్ ఎన్నికలను ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మాక్ ఎన్నికల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నిర్వహణ, ఓటింగ్ విధానం, ఓట్ల లెక్కింపు తదితర అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ...