నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి :
గుడివాడ గ్రామంలో గణేష్ యువ శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద చివరి రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకులు శిగ అభిరామ్ గౌడ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలు, యువతతో కలిసి భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పొడిచేటి జాని గౌడ్ తో పాటు సహచర మిత్ర బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా యువత ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

