డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి – సీఐ వెంకట్ రెడ్డి

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :  విద్యార్థులు డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును బంగారు బాటలో తీర్చిదిద్దుకోవాలని దేవరకొండ సీఐ వెంకట్ రెడ్డి సూచించారు. దేవరకొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నశా ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకట్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్‌, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు....