ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : తెలంగాణ వీరనారి,తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శనివారం మండల కేంద్రంలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రజక సంఘం నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ దొరల దోపిడీకి,భూస్వాముల అణిచివేతకు వ్యతిరేకంగా,అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ధైర్యంగా పోరాడిన ఆమె జీవితం యావత్ తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని,ఆమె చూపిన తెగువ,ఆత్మగౌరవం నేటి తరాలకు మార్గదర్శకమని నాయకులు కొనియాడారు. ఈ...