దళిత సంఘాల ఐక్యతతో హక్కుల సాధనకు ఉద్యమించాలి
నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి: దళితులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం, సమాజ మార్పు కోసం ప్రశ్నించే అణగారిన గొంతులన్నీ ఏకమై దళిత జాతుల అభివృద్ధికి కృషి చేయాలని దళిత మేధా శక్తి వ్యవస్థాపక ఆవిర్భావ సభ్యులు కొయ్యడ కుమారస్వామి, బోట్ల దయాకర్ అన్నారు. దళిత సంఘాల ఐక్యతతో దళిత సమాజంలో చైతన్యం, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయని వారు పేర్కొన్నారు. దళితుల్లో ఉన్న చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి దళితుల ఐక్యత, హక్కులు, రాజ్యాధికారం కోసం సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దస్తగిరిపల్లి గ్రామ కమిటీ...