నల్గొండలో కూలీ హత్య ఘటన
నవపక్షం, నల్లగొండ ప్రతినిధి : నల్గొండ పట్టణంలోని మీర్‌బాగ్ కాలనీ రోడ్ నంబర్–6లోని షా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో హత్య ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులోని 402వ గదిలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడు తమిళనాడుకు చెందిన కూలీగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నల్గొండలో నూతనంగా ఏర్పాటు చేయనున్న చెన్నై షాపింగ్ మాల్ నిర్మాణ పనుల నిమిత్తం తమిళనాడు నుంచి కూలీలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కూలీల మధ్య కూలీ డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసినట్లు...