పాటే ఆయుధంగా.. గళమే గుర్తింపుగా మద్నూర్ యువ గాయని గల్కట్వార్ సంధ్యారాణి ప్రస్థానం
నవపక్షం, మద్నూర్ ప్రతినిధి: మారుమూల గ్రామీణ ప్రాంతం, నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మద్నూర్ యువ గాయని గల్కట్వార్ సంధ్యారాణి తన గళంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ చదువును కొనసాగిస్తూనే జానపద కళను నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. మద్నూర్ మండల కేంద్రానికి చెందిన సంధ్యారాణి తండ్రి సాయిలు ఆటో డ్రైవర్ కాగా, తల్లి సవిత వ్యవసాయ కూలీ. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పట్టుదలతో విద్యను కొనసాగించిన ఆమె 2021లో బిచ్కుందలో బీఈడీ, 2024లో కామారెడ్డి ప్రభుత్వ...