ఉద్యమకారుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం: బీర్ల అయిలయ్య

నవపక్షం, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బీర్ల అయిలయ్య తెలంగాణ ఉద్యమ చరిత్రను, ఉద్యమకారుల పోరాట స్ఫూర్తిని...