చిట్టీల పేరుతో భారీ మోసం – రూ. 10 కోట్ల వసూల్ చేశారన్న ఆరోపణలు

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి : చివ్వెంల మండలం లక్ష్మీ నాయక్ తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భానోత్ రాజు నాయక్ చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించి, ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల వివరాల ప్రకారం, రాజు నాయక్ అధిక వడ్డీ చెల్లిస్తానని, చిట్టీల ద్వారా మంచి రాబడి కల్పిస్తానని నమ్మబలికి లక్ష్మీ నాయక్ తండాతో పాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు ఐదు గ్రామాలకు చెందిన...