శ్రీ ప్రగతి కాలేజి లో 40 మందిలో 10 మంది విద్యార్థులకు 9కి పైగా గ్రేడ్ పాయింట్లు

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: ఇటీవల విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విడుదల చేసిన డిగ్రీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాల్లో కోట మండలం కోటలోని శ్రీ ప్రగతి డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగానికి చెందిన విద్యార్థిని అమృత 9.8 గ్రేడ్ పాయింట్లు సాధించి విభాగంలో ప్రథమ స్థానంలో నిలవగా, ఆయేషా 9.5 గ్రేడ్ పాయింట్లు సాధించింది.పరీక్షలకు హాజరైన 40 మంది విద్యార్థుల్లో ఏకంగా 10 మంది 9కి పైగా గ్రేడ్ పాయింట్లు సాధించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా వియ...