గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు
నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : స్వాతంత్ర్య సమరయోధుడు,విప్లవ కెరటం,షాహిద్ భగత్‌సింగ్ జయంతి వేడుకలు మండల కేంద్రంలోని గీతాంజలి విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతాంజలి హై స్కూల్ కరస్పాండెంట్ దొంతూరి పరమేశ్వర్ రావు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భగత్‌సింగ్ అమరత్వాన్ని స్మరించుకుంటూ నినాదాలు చేశారు.ఈ సందర్బంగా కారస్పాండెంట్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన మహోన్నత విప్లవ యోధుడు భగత్‌సింగ్ అని కొనియాడారు.దేశం కోసం ఆయన ప్రదర్శించిన ధైర్యం, త్యాగం,దేశభక్తి...