వ్యాపారవేత్త బ్రెయిన్‌డెడ్.. నలుగురికి కొత్త జీవితం
నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ఓ మహిళా వ్యాపారవేత్త మరణానంతరం అవయవదానం చేసి నలుగురు రోగులకు కొత్త జీవితాన్ని అందించారు. హైదరాబాద్ మణికొండకు చెందిన వ్యాపారవేత్త మడుగుల దీప్తి రెడ్డి (42) ఈ నెల 22న మెదడులో రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ నెల 26న దీప్తి రెడ్డిని వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. దీంతో ఆమె భర్త ప్రదీప్ రెడ్డి అవయవదానానికి ముందుకు వచ్చారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో దీప్తి రెడ్డి రెండు కిడ్నీలు, కాలేయం,...