గణనాథుడి గ్రామోత్సవంతో మార్మోగిన కోట దళితవాడ

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: కోట మండలంలోని కోట దళితవాడలో ఎసీసీ అంబేద్కర్ క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలు సోమవారం ఘనంగా ముగిశాయి.వేడుకల ముగింపు సందర్భంగా నిర్వహించిన గణనాథుడి గ్రామోత్సవం భక్తిశ్రద్ధలు,యువత ఉత్సాహంతో అంగరంగ వైభవంగా సాగింది. టీడీపీ నేతలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి,షేక్ జలీల్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఎసీసీ అంబేద్కర్ క్రికెట్ యూత్ సభ్యులు ఇరువురు నేతలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్...