అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత దినోత్సవం

నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 28: డిజిటల్ యుగంలో సమాచారం కేవలం ఒక వనరు కాదు... ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్. ఒకప్పుడు సమాచారాన్ని పొందడం పెద్ద సవాలుగా ఉండేది. నేడు సమాచారం కొరత కంటే, నిజమైన సమాచారాన్ని గుర్తించడం మరింత పెద్ద సవాలుగా మారింది. ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్ వీడియోలు, మిస్‌ఇన్ఫర్మేషన్, డిస్‌ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియా రూమర్లు వంటి సమాచార అస్తవ్యస్తత (Information Disorder) ప్రజల్లో గందరగోళాన్ని పెంచడమే కాకుండా, సంస్థలు–సమాజం మధ్య ఉన్న విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత...