అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత దినోత్సవం

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : డిజిటల్ యుగంలో సమాచారం కేవలం ఒక వనరు కాదు; అది ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్. ఒకప్పుడు సమాచారాన్ని పొందడం కష్టమైతే, నేడు అసలు సమస్య సమాచారం లేకపోవడం కాదు—నిజమైన సమాచారాన్ని గుర్తించడం. ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్స్, మిస్ఇన్ఫర్మేషన్, డిస్‌ఇన్ఫర్మేషన్ వంటి సమాచార అస్తవ్యస్తత (Information Disorder) సమాజ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026 అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత దినోత్సవం తీసుకున్న థీమ్ అత్యంత సమయోచితమైనది.సమాచారం హక్కు అంటే ఏమిటి? ప్రతి పౌరుడికి ప్రభుత్వ సమాచారాన్ని తెలుసుకునే...