ACB వలలో నాంపల్లి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ప్రైవేటు వ్యక్తి

నవపక్షం, నాంపల్లి, సెప్టెంబర్ 28: వ్యవసాయ భూమికి సంబంధించిన పంచనామా నివేదికను తహసీల్దార్‌కు సమర్పించేందుకు లంచం డిమాండ్ చేసి, రూ.15 వేల నగదు స్వీకరిస్తుండగా నాంపల్లి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఓ ప్రైవేటు వ్యక్తి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.   నల్గొండ జిల్లా నాంపల్లి మండల తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాళ్లబండి గోపరాజు (AO-1), ఓ ఫిర్యాదుదారుడి వ్యవసాయ భూమికి సంబంధించిన పంచనామా నివేదికను తహసీల్దార్‌కు సమర్పించి అధికారిక ప్రక్రియ పూర్తి చేసేందుకు రూ.15,000...