తాడి హిప్పర్లలో మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం
నవపక్షం, మద్నూర్ ప్రతినిధి : మద్నూర్ మండల పరిధిలోని తాడి హిప్పర్లలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు సోమవారం తీర్మాన కాపీలను ఎస్సై మోహన్ రెడ్డికి, తహశీల్దార్ ఎం డి. ముజీబ్ కు గ్రామ సర్వంచ్ అశ్విని సుదర్శన్ మన్నా, ఉపసర్పంచ్, గ్రామస్తులు కలిసి సంయుక్తంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గ్రామంలో ఎలాంటి మద్యం అమ్మకాలు జరగకుండా పోలీసులు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్...