రిషి ఇంజినీరింగ్ కాలేజీకి మంజూరైన స్వయం ప్రతిపత్తి హోదాపై సమగ్ర విచారణ జరపాలి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  రిషి ఇంజినీరింగ్ కాలేజీకి మంజూరైన స్వయం ప్రతిపత్తి (Autonomous) హోదాకు సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టత అవసరముందని పేర్కొంటూ, సంబంధిత నిబంధనలు మరియు ప్రమాణాల మేరకు సమగ్ర విచారణ నిర్వహించాలని కోరుతూ JNTUH అటానమస్ & అఫిలియేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ తారా కళ్యాణికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కూకట్‌పల్లి జిల్లా కన్వీనర్ పడమటి భరత్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. కాలేజీకి స్వయం ప్రతిపత్తి హోదా మంజూరు చేసే ప్రక్రియలో వర్తించే నిబంధనలు, మార్గదర్శకాలు మరియు అర్హతా...