దేవరకొండ వృద్ధాశ్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా సేవా కార్యక్రమం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేసి, వారితో కొంతసేపు ఆప్యాయంగా గడిపారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంజయ్ గణాత్ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ గణాత్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు...