శ్యామసుందరపురం కాలనీ సీసీ రోడ్లకు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి కృషి
నవపక్షం, కోట ప్రతినిధి : కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమమవుతోంది.కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు టీడీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మంగళవారం కాలనీలో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రహదారులు బురదమయంగా మారుతున్నాయని స్థానికులు వినోద్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యను గుర్తించిన ఆయన వెంటనే ఈ విషయాన్ని స్థానిక...