బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి

నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 29:     బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన విషయాలపై ఈ సందర్భంగా చర్చించారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలను, పిల్లల చదువుల గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి, నియోజకవర్గ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తానని కేటీఆర్ తెలిపారు.