పీఎం శ్రీ మోడల్ స్కూల్ మర్రిగూడలో ఘనంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల స్వాగత వేడుకలు
నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి : మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల స్వాగత వేడుకలను (ఫ్రెషర్స్ డే) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, ఆటలు, వినోద కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమలోని ప్రతిభను ప్రదర్శించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, వివిధ ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాటలు, నృత్యాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. నూతనంగా...