స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి – సందీప్ బల్లెం, స్కిలోక్రసీ కో ఫౌండర్
నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు, సాంకేతికతలోనే ఉండదు. ప్రతి పౌరుడిలో దాగి ఉన్న నైపుణ్యంలో ఉంటుంది. ఈ ఆలోచనే స్కిలోక్రసీ ఉద్యమానికి పునాది. ఇప్పటి ప్రపంచంలో ఉద్యోగాలు మారుతున్నాయి. కృత్రిమ మేధస్సు , ఆటోమేషన్, డిజిటలైజేషన్ వల్ల అనేక సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. కానీ ఒక నిజం మాత్రం మారలేదు—నైపుణ్యం ఉన్న వ్యక్తికి ఎప్పుడూ విలువ ఉంటుంది.స్కిలోక్రసీ అంటే ఏమిటి? స్కిలోక్రసీ అంటే "అర్హత కాదు, నైపుణ్యమే అసలైన అర్హత" అనే సామాజిక ఉద్యమం....