బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మధుకర్ జీకి ఘన సన్మానం

నవపక్షం, చిట్యాల ప్రతినిధి : బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్న మధుకర్ జీ ని బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్, అడ్వకేట్ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలోని ఆర్గానిక్ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న సందర్భంగా చిట్యాలకు విచ్చేసిన మధుకర్ జీ ని బీజేపీ నాయకులు కలిసి నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్...