నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి, అక్టోబర్ 03 :
నారక్కపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల కార్యకర్తలు మిడిదొడ్డి రాజకుమార్, బానోతు వీరన్నలు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్లూరి రమేష్, బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు కుంచాల రాజు, అధ్యక్షులు తిప్పని చేరాలు, గ్రామ ఉపాధ్యక్షులు శ్రీపతి కుమారస్వామి, సలహాదారు రాజిరెడ్డి, మెర్గ్ మల్లయ్య, ఎస్సీ గ్రామ అధ్యక్షులు మామిడి కృష్ణ, మాజీ వార్డు సభ్యులు కోడూరు లింగమయ్య, నాయకులు ముట్నేని రాజకుమార్, గొట్టమొక్కుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
