కంది పంటపై పొలంబడి

నల్లగొండ , నాంపల్లి మండల ప్రతినిధి :

మండలంలోని దేవత్‌పల్లి గ్రామంలో కంది పంటపై పొలంబడి కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ–ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతులకు కంది సాగులో ఆధునిక యాజమాన్య పద్ధతులు, పురుగు, తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మునుగోడు వ్యవసాయ శాఖ ఏడీఏ బి. వేణుగోపాల్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులను పాటించడం ద్వారా కంది సాగులో పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. పర్యావరణహిత పద్ధతులతో పంటల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

మండల వ్యవసాయ అధికారి బండారు శివ మాట్లాడుతూ కంది పంటలో పురుగుల నివారణకు లింగాకర్షక బుట్టలు, పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడంతో పాటు అంతర పంటల సాగు చేపట్టాలని సూచించారు. పొలంబడి ద్వారా వ్యవసాయ శాఖ అందిస్తున్న సూచనలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో ఏఈఓ గణేష్, ఆత్మ బీటీఎం రమేష్, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, దేవత్‌పల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.

Hot this week

జేవిఆర్ ఈవీ మొబిలిటీ షో రూమ్ ప్రారంభించిన డిఎస్పి శివరామిరెడ్డి

నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి ; నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో...

నాంపల్లిలో ‘మట్టి… మహిళ… మనిషి’ కవితా సంకలన పుస్తకాల పంపిణీ

  నాంపల్లి, నవపక్షం ప్రతినిధి: నాంపల్లి మండల కేంద్రానికి చెందిన కవి, రచయిత,...

ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన కిషోర్

నవపక్షం, తుంగతుర్తి ప్రతినిధి : ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్...

అయ్యప్ప భక్తులకు శబరిమలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి – మంచికంటి ధనంజయ

  నవపక్షం, యాదగిరిగుట్ట ప్రతినిధి : శబరిమల అయ్యప్ప సేవా సమాజం (SASS) నేషనల్...

Topics

మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్, గ్రేసియా ప్రకటించిన – మంత్రి శ్రీధర్ బాబు

నవపక్షం, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ ఘాట్, రోడ్డు లో జరిగిన బస్సు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.