జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి

నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఉద్యోగులతో సమానంగా షరతులు లేని క్యాష్ లెస్ హెల్త్ కార్డులు జారీ చేయడంతో పాటుగా జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూ(టీజేఎఫ్)143 ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా విన్నప కార్యక్రమాన్ని శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా అర్హత...