ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కలిసిన కిషోర్

నవపక్షం, తుంగతుర్తి ప్రతినిధి : ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అరవపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ వంగమర్తి గ్రామ శాఖ అధ్యక్షులు గుండె కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి, ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గుండె కిషోర్ మాట్లాడుతూ, పట్టభద్రుల సమస్యలు, యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఉద్యోగ అవకాశాలు, విద్యావంతుల ఆకాంక్షలను శాసనమండలిలో బలంగా వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టభద్రుల హక్కులు, సంక్షేమం,...