నవపక్షం, నల్లబెల్లి, అక్టోబర్ 4:
మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నరేందర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నారక్కపేట గ్రామ సర్పంచ్ దండం సంపత్, ఉప సర్పంచ్ సూరబోయిన రాంబాబు, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిప్పారం రాంబాబు, మాజీ ఎంపీటీసీ ఓదెల రవి, మాజీ సర్పంచ్ మోర్తాల రామారావు తదితరులు పాల్గొన్నారు


