పనులు నాణ్యత తో పాటు వేగంగా పూర్తి చేయాలి – వికారాబాద్ మునిసిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి
నవపక్షం ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరి వార్డుల్లో జరుగుతున్న సిసి రోడ్డు డ్రైనేజ్,పనులను ఆదివారం మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శాసన సభాధిపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్, వికారాబాద్ మున్సిపల్, చైర్,పర్సన్ గడ్డం అనన్య, సహకారంతో, అభివృద్ధి పనులను చేయడం జరుగుతుందన్నారు. అలాగే,సిసి రోడ్డు డ్రైనేజీ పనుల్లో నాణ్యతతో పాటు, త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్,కు సూచించారు.