అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి కి ఘన సత్కారం

నవపక్షం, కోట మండల ప్రతినిధి : కోట మండలం కొక్కుపాడు సెక్టార్ పరిధిలోని నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామం ఎస్టీ కాలనీలో సోమవారం 8వ జాతీయ పోషణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ మునికుమారి ఆదేశాల మేరకు సూపర్వైజర్ పద్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, మహిళలకు పోషకాహారం, ఆరోగ్యం,పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు,చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే పోషణ మహోత్సవం ప్రధాన ఉద్దేశమని తెలిపారు....