నవపక్షం, వికారాబాద్ ప్రతినిది :
వికారాబాద్ మార్కెట్ యార్డులో పనిచేస్తున్నటువంటి హమాలీలకు భద్రత మా బాధ్యత అని వికారాబాద్ ఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. సోమవారం మార్కెట్ పనిచేస్తున్న హమాలీలతో చైర్మన్ వైస్ చైర్మన్, మల్లేశం, లు సమావేశంనిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ హమాలీలకు మార్కెట్ కమిటీ తరఫునుండి (2,00,000)రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తింప చేస్తామని అదేవిధంగా ప్రభుత్వం ద్వారా అందించే లేబర్ ఇన్సూరెన్స్ కార్డు సైతం ప్రతి ఒక్క హమాలీకి అందేలా చూస్తామని, అదేవిదంగా హమాలీలకు సంబందించిన వివిధ సమస్యలపై చర్చించి వారికీ తప్పకుండ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు దారులు మరియు హమాలీలు పూర్తిగా సహకరించాలని త్వరలో మార్కెట్ తరపున హమాలీలకు నూతన వస్త్రాలు అందిస్తామని తెలియచేసారు ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మరియు సభ్యులు పాల్గొన్నారు

