క్లోజర్ స్పేసింగ్‌తో అధిక దిగుబడులు సాధించాలి
నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి : పత్తి సాగులో శాస్త్రీయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. మర్రిగూడ మండలం రామ్‌రెడ్డిపల్లి గ్రామంలో ‘కపాస్ కాంతి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’ కార్యక్రమంలో భాగంగా పత్తిలో క్లోజర్ స్పేసింగ్ (దగ్గరగా విత్తే విధానం), అధిక సాంద్రత పత్తి సాగు విధానాలపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పత్తిలో సరైన విత్తన దూరాన్ని పాటించడం ద్వారా మొక్కల సంఖ్యను సమర్థంగా నిర్వహించవచ్చని...