నైపుణ్యమే.. ఉపాధికి బాట
నవపక్షం, చౌటుప్పల్, అక్టోబర్ 06 : వృత్తి విద్యతో నైపుణ్యాలను పెంపొందించుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని శ్రీ చైతన్య అకాడమీ ఆఫ్ పారామెడికల్ టెక్నాలజీ కళాశాల కరెస్పాండెంట్ కం ప్రిన్సిపాల్ ఢిల్లీ శేఖర్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్‌లోని జయశ్రీ ఫంక్షన్‌హాల్‌లో కళాశాల స్వాగత వేడుకలను ఘనంగా నిర్వహించారు. శేఖర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యతోపాటు వృత్తిపరమైన నైపుణ్యాలు ఎంతో అవసరమన్నారు. పారామెడికల్ రంగంలో నైపుణ్యం సాధించిన వారికి విస్తృతమైన ఉపాధి...