మాక్‌ ఎలక్షన్స్‌తో ఎన్నికల ప్రక్రియపై అవగాహన

నవపక్షం , దేవరకొండ మండల ప్రతినిధి : విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ, ఓటింగ్‌ ప్రక్రియపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు మునగాల కొండల్‌రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్‌)లో మాక్‌ ఎలక్షన్స్‌ నిర్వహించారు. పొలిటికల్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో బెస్ట్‌ ప్రాక్టీస్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.   ఎన్నికల ప్రకటన నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు, ఓటింగ్‌, ఓట్ల లెక్కింపు వరకు వివిధ దశలను విద్యార్థులతోనే నమూనా ఎన్నికల రూపంలో నిర్వహించారు. ఎన్నికల నియమ నిబంధనలు,...