రెడ్‌క్రాస్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి

 

 

నవపక్షం, నల్లగొండ ప్రతినిధి, అక్టోబరు 5:

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నల్లగొండ బ్రాంచ్ ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. గతంలో పలుమార్లు ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఈసారి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో పోటీ నెలకొంది. 2026–29 కాలానికి 15 మంది సభ్యులతో కూడిన మేనేజింగ్ కమిటీని ఎన్నుకునేందుకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.

 

రెడ్‌క్రాస్ సంస్థ మానవతా సేవలు, రక్తదానంపై అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పాలకవర్గం ఎన్నికలకు పోటీ ఏర్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

33 నామినేషన్లు దాఖలు

 

నల్లగొండ రెడ్‌క్రాస్ బ్రాంచ్ చరిత్రలో తొలిసారిగా 33 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 3న నామినేషన్ల స్వీకరణ పూర్తికాగా, అక్టోబరు 5న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్ల పరిశీలన నిర్వహించారు. అక్టోబరు 6న అదే సమయానికి నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఉపసంహరణ అనంతరం తుది బరిలో ఎంతమంది అభ్యర్థులు ఉంటారన్నది స్పష్టమవుతుంది.

 

సేవా భారత్ సభ్యుల తొలిసారి పోటీ

 

ఈసారి ఎన్నికల్లో సేవా భారత్‌కు చెందిన సభ్యులు తొలిసారిగా ప్రత్యేక ప్యానల్‌గా బరిలోకి దిగారు. సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న 15 మంది సభ్యులతో కూడిన ప్యానల్ పోటీ చేస్తోంది. మరో ప్యానల్‌తో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. రక్తదానం, సామాజిక సేవలు, విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యలను మరింత విస్తరించాలనే అంశాలను ప్యానల్ సభ్యులు ప్రస్తావిస్తున్నారు.

 

1,351 మంది ఓటర్లు

 

తుది ఓటర్ల జాబితా ప్రకారం నల్లగొండ బ్రాంచ్‌లో మొత్తం 1,351 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో సుమారు 1,100 మంది నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందినవారు కాగా, మిగిలిన వారు మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్‌తో పాటు వివిధ పట్టణాలు, గ్రామాలకు చెందిన సభ్యులు ఉన్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలకు ఆరు నెలల ముందు సుమారు 850 మంది కొత్తగా సభ్యత్వం పొందినట్లు సమాచారం.

 

11న పోలింగ్‌కు ఏర్పాట్లు

 

నామినేషన్ల ఉపసంహరణ అనంతరం కూడా పోటీ కొనసాగితే అక్టోబరు 11న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ భవనంలో పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం నూతన మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్, వైస్‌చైర్మన్, కోశాధికారి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు.

 

నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికలపై తుది స్పష్టత రానుండటంతో నల్లగొండ రెడ్‌క్రాస్ బ్రాంచ్ ఎన్నికల ప్రక్రియపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది.

Hot this week

ఉత్తమ ఆశ వర్కర్‌గా మానేపల్లి నిర్మల

నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి:  ఉత్తమ ఆశ వర్కర్‌గా కొమురం...

ఫుట్‌బాల్‌లో కార్తీక్‌ ప్రతిభ – రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

  నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను...

రెడ్‌క్రాస్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి

    నవపక్షం, నల్లగొండ ప్రతినిధి, అక్టోబరు 5: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నల్లగొండ...

నైపుణ్యమే.. ఉపాధికి బాట

  నవపక్షం, చౌటుప్పల్, అక్టోబర్ 06 : వృత్తి విద్యతో నైపుణ్యాలను పెంపొందించుకుంటే మెరుగైన...

క్లోజర్ స్పేసింగ్‌తో అధిక దిగుబడులు సాధించాలి

  నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి :  పత్తి సాగులో శాస్త్రీయ పద్ధతులను అవలంబించి...

Topics

ఉత్తమ ఆశ వర్కర్‌గా మానేపల్లి నిర్మల

నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి:  ఉత్తమ ఆశ వర్కర్‌గా కొమురం...

ఫుట్‌బాల్‌లో కార్తీక్‌ ప్రతిభ – రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

  నవపక్షం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను...

రెడ్‌క్రాస్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి

    నవపక్షం, నల్లగొండ ప్రతినిధి, అక్టోబరు 5: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నల్లగొండ...

నైపుణ్యమే.. ఉపాధికి బాట

  నవపక్షం, చౌటుప్పల్, అక్టోబర్ 06 : వృత్తి విద్యతో నైపుణ్యాలను పెంపొందించుకుంటే మెరుగైన...

క్లోజర్ స్పేసింగ్‌తో అధిక దిగుబడులు సాధించాలి

  నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి :  పత్తి సాగులో శాస్త్రీయ పద్ధతులను అవలంబించి...

చిన్న దడిగి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమావేశం

​నవపక్షం, జుక్కల్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో...

ఆవల్‌గావ్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల అవగాహన మరియు పేర్ల నమోదు

నవపక్షం, జుక్కల్ ప్రతినిధి : ఎల్-నినో ప్రభావం వల్ల రాబోయేకాలంలో తలెత్తే వర్షాభావ...

నాణ్యత కలిగిన సన్న బియ్యం పంపిణీ ఉద్దేశంతోనే స్మార్ట్ కార్డుల పంపిణీ

  నవపక్షం, శాలిగౌరారం : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.