సేవా పక్వాడలో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాలు

  నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి:  సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో స్వచ్ఛ భారత్‌పై వ్యాసరచన పోటీలు, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో స్వచ్ఛతపై అవగాహన పెంపొందించేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించడంతో పాటు, పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మై భారత్ యూత్ వాలంటీర్ వెంకటంపేట ఆంజనేయులు, మోడల్ స్కూల్ అధ్యాపకులు ఆర్.కరుణాకర్, ఉపాధ్యాయులు శంకర్, శ్రీహరి పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,...