పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు

    నవపక్షం, కోట మండల ప్రతినిధి :  పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని అంగన్‌వాడీ సూపర్వైజర్ ఐ. కిష్టమ్మ అన్నారు. చిన వంజివాక అంగన్‌వాడీ కేంద్రంలో సూపర్వైజర్ ఐ. కిష్టమ్మ ఆధ్వర్యంలో పోషకాహార మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐ. కిష్టమ్మ మాట్లాడుతూ.. చిన్నారుల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి బరువు, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. పిల్లల్లో పోషకాహార లోపం లక్షణాలు కనిపిస్తే...