VO భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ మండలం శేరిపల్లి, రత్యాతండాలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య (VO) భవనాలను ఎమ్మెల్యే బాలునాయక్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల సర్పంచ్ గౌడ్, వార్డుల పద్మ, గోపి, శంకర్, శ్రీను, బిక్కు, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.