దేవరకొండలో గిరిజన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: దేవరకొండ ఎన్కెల్ ప్రభుత్య డిగ్రీ కళాశాల(అటానమస్)లో గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాట్లాడుతూ.. విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుని మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. వివిధ విభాగాల్లో శిక్షణ ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని ఆయన కోరారు.