సేవా పక్వాడలో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాలు
నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి : సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా మర్రిగూడలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్లో స్వచ్ఛ భారత్‌పై వ్యాసరచన పోటీలు, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం, స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహించారు. విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు, స్వచ్ఛమైన సమాజ నిర్మాణంపై బాధ్యతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మర్రిగూడ ఎస్సై రాంబాబు, పాఠశాల ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం నిర్వహించిన...