గుడివాడ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి :  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ పండుగ విశిష్టతను చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాచకొండ నాగమ్మ అంజయ్య, ప్రధానోపాధ్యాయులు కొండ శంకర్ గౌడ్,  ఉపసర్పంచ్ చిత్తలూరి జానయ్య, వార్డు సభ్యుడు రాచకొండ...