పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

నవపక్షం, మర్రిగూడ మండల ప్రతినిధి : పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌, మర్రిగూడలో ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ముందస్తు సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. డీజే సంగీతం, బతుకమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రకృతిపై ప్రేమను, పూల మొక్కల...